TG: శంషాబాద్ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి బ్యాగులో సెల్ఫోన్ బ్యాటరీ పేలడంతో కలకలం రేగింది. రాయ్పూర్ వెళ్లేందుకు వచ్చిన లక్ష్మణ్ ప్రసాద్ లగేజీని CISF సిబ్బంది తనిఖీ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఒక్కసారిగా పేలుడు శబ్దం రావడంతో తోటి ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ప్రమాదం జరగలేదు. బ్యాటరీ పేలడానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.