AP: మంత్రి టీజీ భరత్ కర్నూలు మెడికల్ కాలేజీలో VRDL ల్యాబ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ల్యాబ్ నిర్మాణం వేగంగా పూర్తి చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఆస్పత్రిలో వెంటిలేటర్లు, అల్ట్రా వెంటిలేటర్లు, అల్ట్రా సౌండ్ మిషన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. మెడికల్ కాలేజీలో రూ.50 కోట్లతో నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.