AP: కూటమి ప్రభుత్వం ఇవాళ రైతన్నల ఖాతాలో అన్నదాత సుఖీభవ 3.0 నిధులు విడుదల చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా 46.85 లక్షల మంది ఖాతాల్లో PM కిసాన్ నిధులతో కలిసి రూ.6 వేల చొప్పున జమ చేయనుంది. ఈ మేరకు కృష్ణాజిల్లా గన్నవరం మం. సూరంపల్లిలో పర్యటించనున్న CM చంద్రబాబు అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేస్తారు. అటు అసోం గువహటిలో PM మోదీ 22వ విడత PM-కిసాన్ నిధులు రిలీజ్ చేస్తారు.