తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ చెన్నై నగరంలోని విల్లివాక్కం నియోజకవర్గం అభ్యర్థులు చర్చనీయాంశంగా మారారు. ఎందుకంటే అన్నాDMK అభ్యర్థిగా విజయకుమార్ బరిలో ఉండగా.. విజయ్ TVK తరఫున ఆధవ్ పోటీ చేస్తున్నారు. అలాగే సీమాన్ నాన్ తమిళర్ కట్చి(NTK) అభ్యర్థిగా సామాజిక కార్యకర్త, ట్రాన్స్జెండర్ రోషిణి బరిలో ఉన్నారు. దీంతో ఎవరు గెలుస్తారన్నది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.