AP: TDP నూతన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన నారా లోకేష్‌కు మంత్రి అనగాని సత్యప్రసాద్ అభినందనలు తెలిపారు. లోకేష్ నాయకత్వంలో టీడీపీ ఉరకలెత్తే యువ ఉత్సాహంతో మరింత ముందుకు సాగుతుందని తెలిపారు. కొత్త కమిటీల్లో భారీ సంఖ్యలో బడుగు బలహీన వర్గాలకు ప్రాతినిథ్యం కల్పించడం చంద్రబాబు, లోకేష్ చిత్తశుద్ధికి నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు.