‘మ్యాడ్’ ఫేమ్ రామ్ నితిన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన తదుపరి చిత్ర స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. వినోదం, ఉత్సవం, గందరగోళం నేపథ్యంలో ఈ వినూత్న కథ ఉండబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అయితే సినిమా టైటిల్‌ను మాత్రం ఇంకా సస్పెన్స్‌లో ఉంచారు. ‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రాలతో మెప్పించిన ఈ యంగ్ హీరో కొత్త పోస్టర్ ప్రస్తుతం ఆకట్టుకుంటోంది.