నిర్మాతగా సక్సెస్ అయిన నిహారిక కొణిదెల నటనకు గుడ్‌బై చెప్పడం లేదని స్పష్టం చేసింది. ఆమె నిర్మించిన ‘రాకాస’ మూవీ రేపు విడుదల కానున్న నేపథ్యంలో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ.. యాక్టింగ్ చేస్తూనే నిర్మాతగా కొనసాగుతానని చెప్పింది. ఈ చిత్రం ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుందని, మొదటి సీన్ నుంచి చివరి వరకు ఆకట్టుకుంటుందని ఆమె ధీమా వ్యక్తం చేసింది.