విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘రణబాలి’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ ఫేమ్ దర్శకుడు అభిషన్ జీవింత్తో ఆయన సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అభిషన్ చెప్పిన కథ నచ్చడంతో విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. కాగా, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు టాక్.