MDCL: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఖండిస్తూ మల్కాజ్గిరిలో బీజేపీ ఓబీసీ మోర్చా నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ ఓబీసీ మోర్చా కన్వీనర్ పి. కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఖర్గేపై కేసు నమోదు చేయాలని సీఐను కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు ప్రసన్న నాయుడు, తదితరులు ఉన్నారు.