MBNR: మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పాలమూరు విశ్వవిద్యాలయం ఉపకులపతి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. శుక్రవారం వర్సిటీలో ఎమ్మెస్ ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఉన్నత స్థాయికి ఎదిగిన వారు తమ మూలాలను మర్చిపోకూడదని హితవు పలికారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్ బాబు, విద్యార్థి సంఘం నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.