MHBD: ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల నేపథ్యంలో గూడూరు మండల కేంద్రంలో సీఐ వినయ్ కుమార్ విద్యార్థులకు నేడు కీలక సూచనలు చేశారు. ఫలితాలు ఎలా వచ్చినా ధైర్యం కోల్పోవద్దని సూచించారు. ఒకసారి ఫెయిల్ అయినా మరోసారి అవకాశముంటుందని, పట్టు వదలకుండా కష్టపడితే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చన్నారు. తొందరపాటు నిర్ణయాలతో కుటుంబాలకు తీరని శోకం మిగల్చవద్దని విద్యార్థులను కోరారు.