AP: రాజధాని అమరావతిలో క్వాంటమ్ ఏర్పాటు ఓ మహత్తర ముందడుగని మంత్రి లోకేష్ అన్నారు. సీఎం చంద్రబాబు దూరదృష్టి ప్రతి రోజూ తమను ఆశ్చర్యపరుస్తోందన్నారు. ఐటీ దిగ్గజం ఐబీఎంకు విశాఖ స్వాగతం పలుకుతోందని హర్షం వ్యక్తం చేస్తూ లోకేష్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టారు. ఐబీఎం కార్యకలాపాలు ప్రారంభమవుతున్న సంకేతాలతో విశాఖ నగరానికి ఐటీ పెట్టుబడులు మరింత పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.