KMM: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయంలో ఇవాళ ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. పలు సమస్యలపై వచ్చిన ప్రజల దగ్గరకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకొని వెంటనే పరిష్కరించాల్సిందిగా సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఫిర్యాదులు సమర్పించడానికి వచ్చిన ప్రజలు మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు.