RR: చేవెళ్ల మున్సిపల్ పరిధి మల్కాపూర్ 12వ వార్డులో నీటి సమస్య తలెత్తడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో ఆదివారం 12వ వార్డులో కొత్త బోరును వేయించారు. కొత్త బోరు ఏర్పాటుతో వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ సమత వెంకట్ రెడ్డి, వార్డ్ సభ్యులు పాల్గొన్నారు.