టెన్నిస్ కింగ్ జకోవిచ్, క్రికెట్ దిగ్గజం కోహ్లీ మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా జకోవిచ్ మాట్లాడుతూ.. కోహ్లీ వల్లే తాను క్రికెట్ చూడటం మొదలుపెట్టానని చెప్పాడు. త్వరలోనే భారత్కు వచ్చి కోహ్లీని కలవాలని ఆశిస్తున్నానని జకోవిచ్ వెల్లడించాడు. కాగా, వీరిద్దరూ కొన్నేళ్లుగా ఇన్స్టాగ్రామ్లో టచ్లో ఉన్న విషయం తెలిసిందే.