NZB: ధర్పల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన పద్మశాలి యువతను పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు. జూనియర్ టీచర్‌గా ఎంపికైన గుండు వీణా, నవీన్, ఎస్సీ కార్పొరేషన్ కళాశాలలో అసిస్టెంట్‌గా నియామకమైన మరిపెద్ది రాహులును శాలువాలు, జ్ఞాపికలతో గౌరవించారు. యువత వీరిని స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు.