మెక్సికోలోని ప్యూబ్లాలో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్లో భారత మహిళల కాంపౌండ్ జట్టు అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ సీజన్లో భారత్కు లభించిన ఏకైక పతకమిది. ఉత్కంఠ పోరులో అమెరికా జట్టుపై భారత మహిళల జట్టు జ్యోతి సురేఖ, ప్రగతి, మధుర ఒక్కపాయింట్తో ఈ ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు.