WGL: నర్సంపేటలోని 29వ వార్డుకు చెందిన సుందరగిరి కార్తీక్‌పై దాడి జరిగిన ఘటన కలకలం రేపింది. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో పాకాల రోడ్డులో తాళ్ల పెళ్లి గురు మెకానిక్ షాప్ వద్దకు వెళ్లిన కార్తీక్‌పై వేముల కృష్ణ ప్రసాద్ ముందుగానే మాటు వేసి ఐరన్ రాడుతో దాడి చేశాడు. హత్యాయత్నంగా జరిగిన ఈ దాడిలో కార్తీక్ తప్పించుకున్నప్పటికీ తలకు బలమైన గాయమైనట్టు తెలిపారు.