SRPT: మునగాల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన చిత్రకారుడు సరికొండ రాజు అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. చిత్రలేఖనంలో తన ప్రతిభకు గుర్తింపుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రులు చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డిల చేతుల మీదుగా ఈయన ఎన్నో అవార్డులు అందుకున్నారు.