చంద్రుడి చుట్టూ చారిత్రాత్మక యాత్రను ముగించుకుని ఆర్టెమిస్-2 వ్యోమనౌక సురక్షితంగా భూమికి చేరుకుంది. కాలిఫోర్నియా సమీపంలోని పసిఫిక్ మహాసముద్రం, శాన్ డియోగో తీరంలో నలుగురు వ్యోమగాములతో విజయవంతంగా ల్యాండ్ అయింది. దశాబ్దాల తర్వాత మానవ సహిత చంద్ర మిషన్లో భాగంగా సాగిన ఈ ప్రయాణం అంతరిక్ష పరిశోధనల్లో కీలక మైలురాయిగా నిలిచింది.