పోస్టల్ శాఖలో 28,636 GDS పోస్టుల భర్తీకి సంబంధించి అధికారులు రెండో షార్ట్ లిస్ట్ ప్రకటించారు. ఇందులో AP నుంచి 555 మంది, TG నుంచి 214 మంది ఎంపికయ్యారు. మెరిట్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులు ఏప్రిల్ 27లోగా ఒరిజినల్ ధ్రువపత్రాలతో డివిజనల్ ఆఫీసులో హాజరుకావాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి ఇప్పటికే SMS, ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందించినట్లు అధికారులు తెలిపారు.