ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబోలో రాబోతున్న భారీ చిత్రం ‘రాకా’. ఈ సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణ ఒక పవర్ఫుల్ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఇన్స్టాలో ‘రాకా’ పోస్టర్ షేర్ చేస్తూ.. ‘పరిధులకు అతీతమైన దృశ్యం కోసం సిద్ధంకండి’ అంటూ పేర్కొంది. దీంతో ఆమె ఈ సినిమాలో నటించడం ఫిక్స్ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.