ADB: వల్గొండ గ్రామంలోకి ఐస్ క్రీమ్ బండ్లు, బయటి ఆటోల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు. తక్కువ నాణ్యతతో, హానికర రసాయనాలతో తయారైన ఐస్ క్రీమ్స్ విక్రయాలు పెరిగి పిల్లలు అనారోగ్యం పాలు కావడంతో ఈ చర్యలు చేపట్టారు. గ్రామ ప్రవేశ ద్వారం వద్ద హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేసి, నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.5,000 జరిమానా విధిస్తామని గ్రామ పెద్దలు స్పష్టం చేశారు.