NGKL: వెల్దండ మండలం పలుగుతాండాలో నూతనంగా ఏర్పాటు చేసిన రేషన్ షాపును సర్పంచ్ సభావాత్ రమేష్ నాయక్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మోతిలాల్ నాయక్ గురువారం ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రజల సౌకర్యార్థం నూతన రేషన్ షాప్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అనిత, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.