AP: జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా పూలే చిత్రపటానికి మంత్రి లోకేష్ నివాళులర్పించారు. దళితుల అభ్యున్నతి, కులవ్యవస్థ నిర్మూలనకు జీవితాంతం కృషిచేశారని గుర్తుచేశారు. ఆయన జయంతిని ప్రజా ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోందని తెలిపారు. సామాజిక సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప సంఘ సంస్కర్త అని చెప్పారు. పూలేను స్ఫూర్తిగా తీసుకుని వారి ఆశయ సాధనకు కృషి చేద్దామన్నారు.