KMM: కల్లూరు మండలంలో కొన్ని గ్రామాలలో యాసంగి వరి సాగు కోతలు పూర్తి కావడంతో అమ్మకానికి రైతులు ధాన్యం సిద్ధం చేశారు. తేమ, తరుగు, కోతలు వంటి సమస్యలు భరించలేక తప్పనిసరి పరిస్థితుల్లో దళారులకు అమ్ముతున్నామని రైతులు అంటున్నారు. సకాలంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో తక్కువ రేటుకి ధాన్యాన్ని దళారులకు అమ్ముకుంటున్నారు.