SDPT: విద్యా రంగ పరిరక్షణకు PRTU TS నిరంతరం కృషి చేస్తుందని ఆ సంస్థ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగ మహేందర్ రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి నంగునూరు మండలం తపస్ మాజీ అధ్యక్షుడు పయ్యావుల జైపాల్ యాదవ్ పీఆర్టీయూలో చేరగా సభ్యత్వం ఇచ్చి సంఘంలోకి ఆహ్వానించి మాట్లాడారు. సంఘ సభ్యత్వం ఉపాధ్యాయుల హక్కులకు రక్షణ కల్పించడమే కాకుండా బాధ్యతలు గుర్తు చేస్తుందన్నారు.