SRD: తెలంగాణ క్రీడా పాఠశాల ప్రవేశాలకు సిర్గాపూర్ మండలం చీమలపాడ్ పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారని ప్రధానోపాధ్యాయులు నర్సుగొండ గురువారం తెలిపారు. మూడో తరగతి చదువుతున్న వై.ప్రనిత్, రహేల్ అనే ఇద్దరు విద్యార్థులు మండల స్థాయి, జిల్లాస్థాయిలో ఎంపికయ్యారు. 4వ తరగతిలో ప్రవేశం కోసం ఈ నెల 30న రాష్ట్ర స్థాయిలో జరిగే క్రీడా పాఠశాలలో ప్రవేశ పరీక్షకు వెళ్లనున్నట్లు చెప్పారు.