AP: గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ జగన్ ఇంటి ముందు ఏర్పాటు చేసిన ‘మావిగన్’ ఫ్లెక్సీ కలకలం రేపుతోంది. ‘రాజధాని అమరావతి వద్దు.. మూడు జిల్లాల మావిగన్తోనే అభివృద్ధి. యువతకు ఆదర్శం.. సమాజానికి అండ మావిగన్.. వన్ పార్టీ.. వన్ ఫ్లాగ్.. వన్ ఎజెండా అంటూ’ ఏలూరి శివాజీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.