AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న మొత్తం 75,691 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా, 39,050 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.16 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.