AP: ‘విన్సెంట్ ఫెర్రర్ మోంచో’ స్పెయిన్ నుంచి వచ్చి సీమ ప్రజలకు ఎంతో మేలు చేసి వారికి ఆరాధ్యుడయ్యారని సీఎం చంద్రబాబు కొనియాడారు. విన్సెంట్ జయంతి సందర్భంగా సీఎం నివాళులర్పించి మాట్లాడారు. ఏపీ, తెలంగాణలోని బలహీన, వెనుకబడిన వర్గాలకు చెందిన 25 లక్షల మంది పేదల పురోగతికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని గుర్తుచేశారు. విన్సెంట్‌ను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.