WNP: జూరాల ప్రాజెక్టు నుంచి కుడి, ఎడమ కాలువలకు రైతుల కోరిక మేరకు నీటిని విడుదల చేసినట్లు ప్రాజెక్ట్ అధికారి వెంకటేష్ తెలిపారు. ఇవాళ నాటికి ప్రాజెక్టులో 4.074 టీఎంసీలు (గ్రాస్), 0.367 టీఎంసీలు (లైవ్) నీరు నిల్వ ఉందన్నారు. ఇన్‌ఫ్లో 63 క్యూసెక్కులు, కాలువలకు 845 క్యూసెక్కులు, మొత్తం అవుట్‌ఫ్లో 931 క్యూసెక్కులుగా నమోదైనట్లు తెలిపారు.