ఎనర్జిటిక్ యంగ్ హీరో రామ్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలిసి.. ఫస్ట్ టైం భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయిపోయింది ఈ ప్రాజెక్ట్. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవలె ధమాకా మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుంది ఈ హాట్ బ్యూటీ. ఈ సినిమా తర్వాత శ్రీలీలకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ స్టార్స్‌తో పాటు యంగ్ హీరోలు, అప్ కమింగ్ కుర్రాళ్లు కూడా శ్రీలీల కావాలంటున్నారు. సోషల్ మీడియాలో కూడా శ్రీలీల క్రేజ్ ఓ రేంజ్లో ఉంది. ఎక్కడ చూసిన అమ్మడి గురించే చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా రామ్, బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతోన్న షూటింగ్లో జాయిన్ అయినట్టు తెలుస్తోంది. దాంతో రామ్ ఫ్యాన్స్ ఇక థియేటర్లో విజిల్సే అంటున్నారు. ఎందుకంటే రామ్ డ్యాన్స్, ఎనర్జీ గురించి అందరికీ తెలిసిందే. అలాంటి హీరోకి శ్రీలీల లాంటి టాలెంటెడ్ బ్యూటీ తోడైతే.. దుమ్ములేవడం ఖాయమంటున్నారు. ముఖ్యంగా డ్యాన్స్ విషయంలో శ్రీలీలకు యమా క్రేజ్ ఉంది. అందుకే రామ్, శ్రీలీల ఇరగదీస్తారని అంటున్నారు. ఇకపోతే ధమాకా సక్సెస్‌తో శ్రీలీల ఒక్కసారిగా పారితోషకం భారీగా పెంచినట్టు తెలుస్తోంది. అసలు పెళ్లి సందడి తర్వేతే కోటీ డిమాండ్ చేసిందని వినిపించింది. అయితే ఇప్పుడు కోటిన్నర నుంచి రెండు కోట్లు డిమాండ్ చేస్తున్నట్టు టాక్. దాంతో.. అంతేగా, దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను శ్రీలీల కరెక్ట్‌గా ఫాలో అవుతోందని అంటున్నారు. మొత్తంగా శ్రీలీల క్రేజ్ అలా ఉంది మరీ!