PLD: పిడుగురాళ్లలో ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా చేశారు. 12వ పీఆర్సీ కమిషన్‌ను వెంటనే నియమించాలని రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. 30% మధ్యంతర భృతి ప్రకటించాలన్నారు. ఎన్నికల హామీ మేరకు సీపీఎస్‌ను రద్దు చేసి, పెండింగ్ డీఏలు చెల్లించాలని కోరారు. ఉపాధ్యాయులపై యాప్‌ల భారం తగ్గించాలన్నారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు.