ADB: కేంద్రమంత్రి నితిన్ ఘడ్కరిని MP గోడం నగేశ్ ఢిల్లీలో బుధవారం రాత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా పరిధిలోని జందపూర్ నుంచి మాహోర్ వరకు NH-44 అప్ గ్రేడ్ చేయటం, మావల నుంచి చాంద వరకు పాత NH-44 విస్తరణ పనుల గురించి కేంద్ర మంత్రితో MP విన్నవించారు. ఈ మేరకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు MP పేర్కొన్నారు.