NLR: పొదలకూరు పట్టణం చిట్టెపల్లి తిప్ప వద్ద అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న గ్రావెల్ ట్రాక్టర్లను సోమవారం పొదలకూరు ఎస్సై హనీఫ్ పట్టుకున్నారు. 5 ట్రాక్టర్లు, 1 జేసీబీను పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్రమంగా గ్రావెల్ తరలిస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఆయనతో పాటు వీఆర్వో, పోలీస్ సిబ్బంది ఉన్నారు.