కోనసీమ: మురముళ్ల టీడీపీ కార్యాలయంలో PGRS కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సుబ్బారాజు నిర్వహించారు. వివిధ మండలాల నుంచి ఆర్జీదారులు హాజరై తమ సమస్యలు సమర్పించారు. తక్షణ పరిష్కారయోగ్య సమస్యలపై అధికారులతో చర్చించి, చర్యలు తీసుకున్నారు. మిగిలిన ఆర్జీలను సంబంధిత శాఖలకు ఆన్ లైన్లో పంపి న్యాయం జరిగేలా చూడాలని సిబ్బందికి ఆదేశించారు.