VSP: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరము 15 వినతులు వచ్చినట్టు జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకారరావు తెలిపారు. మధురవాడ జోన్కు 1, ఈస్ట్ జోన్ 5, సౌత్ జోన్ 2, నార్త్ జోన్ 4, పెందుర్తి జోన్ 3 వినతులు వచ్చాయి. వినతులను నిర్ణీత సమయంలో టౌన్ ప్లానింగు అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలని ఆదేశించారు.