KDP: బి.మఠంలోని ప్రభునగర్ అంగన్వాడీ సెంటర్లో 28 మంది పిల్లలు చదువుకుంటున్నారు. అయితే, భవనం పైకప్పు పెచ్చులూడుతుండటంతో ఎప్పుడు ప్రమాదం ముంచుకొస్తుందోనని అంగన్వాడీ టీచర్ లత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యకు తక్షణమే పరిష్కారం చూపాలని గ్రామస్థులు, సిబ్బంది అధికారులను కోరుతున్నారు. పిల్లల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.