ELR: పోలవరం ప్రాజెక్ట్ ఆర్అండ్ఆర్ కాలనీలకు మిగిలిన భూసేకరణను త్వరితగతిన పూర్తిచేయాలని ఏలూరు కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లాలోని వివిధ ప్రాజెక్టుల భూసేకరణలపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో వివిధ ప్రాజెక్టుల భూసేకరణ, పీసా కమిటీ ఆమోదం విషయాలపై చర్చించారు.