NTR: ప్రభుత్వ పాఠశాలల్లో అత్యున్నత విద్యా ప్రమాణాలతో విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. శుక్రవారం నందిగామలోని డీవీఆర్ కాలనీ ఎంపీపీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలుపై ప్రత్యేకంగా దృష్టిసారిందని చెప్పుకొచ్చారు.
Tags :