NTR: ఆనందమయ జీవితాన్ని సొంతం చేసుకునేందుకు ఆన్లైన్ యోగా అద్భుత అవకాశమని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో అమరావతి యోగా అండ్ ఏరోబిక్స్ అసోసియేషన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ‘అమరావతి యోగా’ యూట్యూబ్ ఛానల్ ప్రత్యక్ష ప్రసారాలను ప్రారంభించారు. ఎంతో మంది యోగాచరణను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకున్నారని కలెక్టర్ చెప్పుకొచ్చారు.