TG: నిన్న విద్యాశాఖ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET)-2026 తొలి విడత నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అభ్యర్థులు రేపటి నుంచి ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. పరీక్షలు జూన్ 15-30 తేదీల్లో జరగనున్నాయి. ఫలితాలు జూలై 28-31 మధ్య వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. సర్వీసులో ఉన్న టీచర్లు కూడా టెట్ రాయాల్సి ఉండటంతో ఈ సారి కనీసం 30 వేల మంది దరఖాస్తు చేసుకుంటారని అంచనా.