RR: మహిళల ఆర్థిక సాధికారతకు మరో ముందడుగు పడుతోంది. సెర్ఫ్ ఆధ్వర్యంలో మహిళా సమాఖ్యల చేత నిర్వహించే పెట్రోల్ బంకులను జూన్ 2 నాటికి ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అలియాబాద్, రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్, వట్టినాగులపల్లి, సంగారెడ్డి జిల్లా కావేలి ప్రాంతాల్లో భూములు ఇప్పటికే మహిళా సమాఖ్యలకు అప్పగించారు.