TG: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయని ఆయిల్ కంపెనీలు భరోసా ఇచ్చాయి. రోజూ సగటున 2.18 లక్షల LPG సిలిండర్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపాయి. వలస కార్మికులు, విద్యార్థులు కేవలం ఐడీ కార్డు, సెల్ఫ్ డిక్లరేషన్‌తో సులభంగా 5 కేజీల ‘ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ’ సిలిండర్ పొందవచ్చు. ఇంధన సరఫరాలో అంతరాయం లేకుండా ప్రభుత్వం, కంపెనీలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి.