నిర్మల్: భైంసాకు చెందిన ‘ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా’ రాష్ట్ర కార్యదర్శి హేమ్ల ప్రసంజీత్ గౌరవ డాక్టరేట్‌కు ఎంపికయ్యారు. అంబేద్కర్ సామాజిక సిద్ధాంతాలపై ఆయన చేస్తున్న కృషికి గుర్తింపుగా ఇంటర్నేషనల్ లూసియానా రీసెర్చ్ యూనివర్సిటీ ఈ అవార్డును ప్రకటించింది. ఈనెల 19న పూణేలో యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ చేతుల మీదుగా ఈ గౌరవాన్ని అందుకోనున్నారు.