HYD నుంచి వివిధ జిల్లాలకు వెళ్లే లగ్జరీ, డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో వేసవి వేళ వాటర్ బాటిల్స్ అందించక పోవడంతో శరీరంలో నీటి శాతం తగ్గి బస్సులోనే వడదెబ్బ తాకుతుంది. ఎండలు విపరీతంగా ఉండడంతో బస్సు ప్రయాణం కష్టతరంగా మారుతుంది. దీనిని పరిగణలోకి తీసుకుని ఫ్రీ బస్సు మినహా మిగతా అన్నింట్లో వేసవిలో వాటర్ బాటిల్స్ అందించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.