BHNG: జిల్లాలో ఏప్రిల్ 18 నుంచి జనగణన మొదటి దశకు సంబంధించిన శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయని జిల్లా ప్రధాన జనగణన అధికారి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఆయన మాట్లాడుతూ.. మొదటి దశలో భాగంగా మొత్తం 13 ఛార్జ్ లెవెల్ కేంద్రాలలో ఏప్రిల్ 18, 20, 21 తేదీలలో ఈ శిక్షణ తరగతులు కొనసాగనున్నట్లు తెలిపారు.