WNP: జిల్లాలో న్యాయవ్యవస్థ పరిరక్షణ కోసం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్.సునీత ఎంతో అంకితభావంతో పనిచేశారని కలెక్టర్ ఆదర్శ్ సురభి కొనియాడారు. జిల్లా న్యాయస్థానం ఆవరణలో బదిలీపై వెళ్తున్న ఆమెకు నిన్న వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా జడ్జి ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు.