SRCL: కోనరావుపేట మండల కేంద్రంలో కేసీఆర్ కప్ క్రీడా పోటీలలో పాల్గొన్న 12 టీంల క్రీడాకారులకు కేసిఆర్ టీషర్టులను బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, క్రీడాకారులు క్రీడల్లో నైపుణ్యం వహించి రాష్ట్రస్థాయికి ఎదగాలని ఉద్దేశంతో కేసీఆర్ యువకులకు ఈ పోటీలను నిర్వహిస్తున్నారన్నారు.